: పాకిస్థాన్ పై అనురాగ్ ఠాకూర్ 'యూ-టర్న్'!


సరిగ్గా ఐదు రోజుల క్రితం పాకిస్థాన్ తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, తద్వారా ఉపఖండంలో క్రికెట్ ను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్ల వచ్చని వ్యాఖ్యానించిన బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఫర్ కంట్రోల్ ఇన్ ఇండియా) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ 'యూ-టర్న్' తీసుకున్నారు. "సరిహద్దుల్లో ప్రజలు చనిపోతున్న వేళ, పాకిస్థాన్ తో క్రికెట్ ఆడలేమని ఆయన తేల్చి చెప్పారు. పొరుగువారితో శాంతినే మేము కోరుకుంటున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే కోరుతున్నారు. అయితే, పాకిస్థాన్ తన దేశంలోని ఉగ్రవాద మూలాలపై కఠినంగా వ్యవహరించాల్సి వుంది" అని అన్నారు. "పాకిస్థాన్ తో ప్రపంచకప్ లో ఆడాము. వచ్చే సంవత్సరం జరిగే ఆసియా కప్ లో ఆడతాము. వరల్డ్ టీ-20లో ఆడతాము. మల్టీ నేషనల్ టోర్నమెంట్లలో ఆడుతున్న రెండు జట్లూ, ద్వైపాక్షిక సిరీస్ ల విషయంలో ఎందుకు ముందడుగు వేయడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం పాక్ చెప్పాల్సి వుంది" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News