: 'అలిపిరి' కేసులో చంద్రబాబుకు సాక్షి సమన్లు ... చివరి దశకు చేరిన విచారణ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు సాక్షి సమన్లు అందజేయాల్సిందిగా తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి సదానందమూర్తి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో సీఎం హోదాలో తిరుమల వెళుతున్న చంద్రబాబుపై మావోయిస్టులు అలిపిరి వద్ద బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. కేసులో రెండో సాక్షిగా ఉన్న ఏలూరు పీటీసీ డీఎస్పీ రాజేశ్వరరెడ్డి నిన్న కోర్టుకు వచ్చి ఘటనను న్యాయమూర్తికి వివరించారు. నాడు చంద్రబాబు కాన్వాయ్ పైలట్ ఆఫీసర్ గా రాజేశ్వరరెడ్డి పనిచేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో సాక్షులను కోర్టు ముందు హాజరుపరచడంలో పోలీసులు విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో చంద్రబాబు 14వ సాక్షిగా ఉండగా, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 13వ సాక్షిగా ఉన్నారు. వారిద్దరినీ ఈ నెల 17న కోర్టుకు హాజరయ్యేలా చూడాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చంద్రబాబుతో పాటు బొజ్జలకు సమన్లు జారీ చేయాలని కూడా ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News