: కుప్పం పర్యటనకు చంద్రబాబు... నేటి రాత్రి అక్కడే బస
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు తన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళుతున్నారు. తన సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటన కోసం నేడు కుప్పం వెళ్లనున్న చంద్రబాబు అక్కడ జరగనున్న జన చైనత్య యాత్రల్లో పాల్గొంటారు. నేటి రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు. చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని అక్కడి పార్టీ నేతలు జన చైతన్య యాత్రల కోసం భారీ సన్నాహాలు చేస్తున్నారు. పనిలో పనిగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపైనా చంద్రబాబు అధికారులతో సమీక్షించనున్నారు.