: రేసులోకి వచ్చినా వెనుకబడ్డ బాగ్దాదీ!... టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంజెలా మెర్కెల్


టైమ్స్ మేగజీన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఈ ఏడాది జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ఎంపికయ్యారు. యూరప్ ఆర్థిక స్థితిగతులు, శరణార్థులను అనుమతించే అంశాలకు సంబందించి ఎంజెలా మెర్కెల్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలే ఆమెకు ఈ కిరీటాన్ని కట్టబెట్టాయని టైమ్స్ మేగజీన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఈ అరుదైన పురస్కారం కోసం తుది జాబితాకు ఎంపికైన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ ఆల్ బాగ్దాదీ కూడా విశ్వవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయనున్న డోనాల్డ్ ట్రంప్ తో కలిసి బాగ్దాదీ ఈ రేసులోకి దూసుకొచ్చారు. ప్రపంచ దేశాలపై దాడులకు తన అనుయాయులను ఉసిగొల్పడంలో తనదైన సత్తా చాటిన బాగ్దాదీ, ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారని టైమ్స్ మేగజీన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News