: చెన్నయ్ లోని స్టార్ హోటల్ 'లి రాయల్ మెరిడియాన్' లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రద్దు!


చెన్నై వరదలు, బాధితుల దుస్థితిని చూసి చలించిపోయిన ఓ ఫైవ్ స్టార్ హోటల్ చైర్మన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. చెన్నైకు చెందిన ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లి రాయల్ మెరిడియాన్ లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించకూడదని చైర్మన్ పీజి పెరియస్వామి నిర్ణయించాడు. ప్రతిఏటా ఈ రెండు వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. కానీ, ఈసారి మాత్రం నిర్వహించట్లేదు. వరదలతో పుట్టెడు దుఖంలో ఉన్న చెన్నై ప్రజలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆయన అన్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏటా పెద్ద క్రిస్మస్ ట్రీని ఈ స్టార్ హోటల్ ఏర్పాటు చేస్తుంది. ఈసారి అటువంటి ప్రయత్నాలేమీ చేయట్లేదు.

  • Loading...

More Telugu News