: 'పారిస్ దాడి'లో పాల్గొన్న మూడో ఉగ్రవాదిని పట్టుకున్న పోలీసులు


పారిస్ దాడులకు పాల్పడి తప్పించుకున్న మూడో ఉగ్రవాదిని ఫ్రాన్స్ పోలీసులు స్ట్రాస్ బర్గ్ నగరంలో అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 13న పారిస్ పై ఉగ్రవాదులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అప్పటి దాడుల్లో పాలుపంచుకున్న మహమ్మద్ అగ్గాద్ (23) ను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. 2013లో తన సోదరుడు, మరి కొందరు స్నేహితులతో కలిసి తాను సిరియా వెళ్లినట్టు అతను పోలీసులకు చెప్పాడు. పారిస్ దాడుల్లో పాల్గొన్న ఇతర ఉగ్రవాదులు సిరియా నుంచి వచ్చినట్టు తెలిపాడు. పారిస్ దాడికి పాల్పడిన తరువాత ఇద్దరు ఉగ్రవాదులు తమను తాము పేల్చుకోగా, ఓ వ్యక్తిని పోలీసులు కాల్చేశారు. మహమ్మద్ అగ్గాద్ మాత్రమే పోలీసులకు పట్టుబడ్డాడు.

  • Loading...

More Telugu News