: టీవీ ఛానల్ లో చర్చకు వెళ్లి వస్తుండగా బీఫ్ నిర్వాహకుల అరెస్టు!
బీఫ్ నిర్వాహకులు ఐదుగురిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఐదుగురు ఓ టీవీ ఛానల్ లో చర్చకు వెళ్లి వస్తుండగా హైదరాబాదు, జూబ్లీహిల్స్ లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఉస్మానియా యూనివర్శిటీలో రేపు బీప్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు వీరికి ఎటువంటి అనుమతులు లభించలేదు. ‘వర్శిటీ’ అధికారులు, హైకోర్టు కూడా ఇందుకు అనుమతించలేదు. అయితే, ఏదేమైనా సరే, బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించి తీరుతామని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులను, బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ఛానల్ లో చర్చకు వెళ్లి వస్తున్న నిర్వాహకులకు పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థి నాయకుల కోసం నిన్న రాత్రి ఉస్మానియా యూనివర్శిటీ హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.