: ప్రధాని మోదీ సర్కారును నడుపుతున్నది సుబ్రమణ్యస్వామి: గులాంనబీ ఆజాద్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నది బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆగస్టులోనే మూసేసిందని ఆయన చెప్పారు. కావాలని కొత్త డైరెక్టర్ ను నియమించుకుని సోనియా, రాహుల్ గాంధీలపై కక్ష సాధింపులకు దిగారని ఆయన మండిపడ్డారు. ఎన్డీయే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆయన విమర్శించారు.