: శ్రీసిటీలో సెల్ ఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అంగీకారం
శ్రీసిటీలో సెల్ ఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారు. భూ కేటాయింపులు జరిపించినందుకు ఫాక్స్ కాన్ ప్రతినిధులు సీఎంకు అభినందనలు తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో చంద్రబాబుతో ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధుల బృందం బుధవారం భేటీ అయింది. ఈ సందర్భంగా ఏపీలో కంప్యూటర్లు, కంప్యూటర్ పరికరాలు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్ ల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులు ప్రతిపాదనలు చేశారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల తయారీ కేంద్రాల ఏర్పాటుకు సహకారమందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.