: ఓయూలో మోహరించిన పోలీసులు...బీఫ్ ఫెస్టివల్ అడ్డుకునేందుకు సిద్ధం
ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని పలు విద్యార్థి సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు హైకోర్టు నిరాకరించినా నిర్వహించి తీరుతామని ప్రకటించడంతో యూనివర్సిటీ సర్క్యులర్ జారీ చేసింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకూడదని పేర్కొంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే వారి అడ్మిషన్ ను రద్దు చేసేందుకు కూడా వెనుకాడమని యూనివర్సిటీ తెలిపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీలో భారీగా పోలీసులను మోహరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకే బందోబస్తు ఏర్పాటు చేశామని వారు వెల్లడించారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకూడదని హైకోర్టు, యూనివర్సిటీ వీసీల నుంచి ఉత్తర్వులు అందుకున్నామని పోలీసులు తెలిపారు.