: కాల్పులకు తెగబడడానికి ముందు 28 వేల డాలర్లు అప్పుతీసుకున్నారు


అమెరికాలోని కాలిఫోర్నియాలో క్రిస్టమస్ పార్టీపై తుపాకులతో విరుచుకుపడ్డ కేసులో జరగుతున్న దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. తుపాకులతో దాడులకు పాల్పడే ముందు ఆ దంపతులు 28 వేల డాలర్లు అప్పు తీసుకున్నట్టు ఎఫ్ బీఐ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ 28 వేల డాలర్లు ఏం చేశారు? ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు అప్పు తీసుకున్నారు? అనే అంశాలపై ఎఫ్ బీఐ అధికారులు ఆరాతీస్తున్నారు. ఈ మొత్తాన్ని 'పీర్ టు పీర్' సంస్థ నుంచి సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ తీసుకున్నట్టు ఎఫ్ బీఐ అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా విచారణ నిర్వహించి మరిన్ని వాస్తవాలు వెలికి తీస్తామని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News