: బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతాం: నిర్వాహకులు


హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తతలు తలెత్తేలా కనిపిస్తోంది. బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో విద్యార్థి నాయకులు, హిందూ సంస్థల మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. ఈ నేపథ్యంలో ఈ అంశం హైకోర్టు ముందుకు వెళ్లింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు మాట్లాడుతూ, ఏదిఎమైనా బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించి తీరుతామని చెప్పారు. తమ ఫెస్టివల్ ను అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలకు తెరతీస్తామని హెచ్చరించారు. దీంతో ఈ బీఫ్ ఫెస్టివల్ ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News