: ఆ స్కూల్లో చదివిన వాళ్లు మరో నలుగురు కూడా ఉగ్రవాదులుగా మారారట!


అమెరికాలోని కాలిఫోర్నియాలో పార్టీ చేసుకుంటున్న సహోద్యోగులపై దాడికి పాల్పడిన మహిళా ఉగ్రవాది తష్పీన్ మాలిక్ చదివిన స్కూల్ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసిన మరో నలుగురు కూడా ఉగ్రవాదులుగా మారారని కెనడా అధికారులు తెలిపారు. దీంతో ఆ స్కూల్ ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ లోని ముల్తాన్ లో గల ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పాకిస్థాన్ అల్-హుదా పాఠశాలకు కెనడాలో ఓ బ్రాంచ్ ఉంది. దీనిని 2004లో ఇస్లామిక్ స్కాలర్ ఫర్హాత్ హష్మీ స్థాపించింది. ముల్తాన్ లోని పాఠశాలలో తష్పీన్ మాలిక్ చదువుకుంది. కెనడాలోని బ్రాంచ్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన 16 నుంచి 20 ఏళ్ల లోపున్న నలుగురు అమ్మాయిలు నేరుగా ఉగ్రవాదుల్లో చేరారని, వారిలో ముగ్గురు టర్కీలోను, ఒకరు సిరియాలోను ఉన్నట్టు ఆధారాలు లభించాయని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News