: ఏదో ఒకటి చేస్తారా? లేక చస్తారా?: ఢిల్లీ కాలుష్యంపై రాహుల్ బజాజ్


దేశ రాజధాని న్యూఢిల్లీలో వాతావరణ కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండటంపై బజాజ్ సంస్థల అధినేత రాహుల్ బజాజ్ ఘాటుగా స్పందించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏదో ఒకటి చేయాలని లేకుంటే చనిపోయేందుకు సిద్ధం కావాలని హెచ్చరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సరి, బేసి సంఖ్యల ఆధారంగా కార్లను వీధుల్లోకి వదలాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. కేజ్రీ మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని, మంచి పనులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, అవి తాత్కాలికమే అవుతాయని అన్నారు. నిత్యమూ కారులోనే ఆఫీసుకు వెళ్లాలని అనుకోకుండా, ఒక రోజు స్నేహితుని కారులో వెళ్లి, మరో రోజు అతన్ని మీ కారులో తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News