: రెజ్లింగ్ టీమ్ ను కొనుగోలు చేసిన రోహిత్ శర్మ


టీమిండియా టాప్ ఆర్డర్ ఆటగాడు రోహిత్ శర్మ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ప్రో-రెజ్లింగ్ లీగ్ లో ఉత్తరప్రదేశ్ జట్టును కొనుగోలు చేశాడు. భారత్ లో ఆరు ప్రధాన నగరాలు కేంద్రంగా ఈ నెల 10వ తేదీ నుంచి ప్రో-రెజ్లింగ్ లీగ్ ప్రారంభం కానుంది. ప్రో-రెజ్లింగ్ లీగ్ లో ఓ జట్టును ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర సొంతం చేసుకున్నాడు. తాజాగా ఉత్తరప్రదేశ్ జట్టును రోహిత్ శర్మ మరో వ్యాపారవేత్తతో కలిసి కొనుగోలు చేశాడు. కాగా, ఐఎస్ఎల్ జట్లను గంగూలీ, సచిన్, ధోనీ, కోహ్లీలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రో-రెజ్లింగ్ జట్టును కొనుగోలు చేయడం ద్వారా రోహిత్ కొత్తగా స్పోర్ట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. భారత్ కు రెజ్లింగ్ లో మంచి రికార్డు ఉందని, యూపీ జట్టుకు సహయజమానిగా ఉండడం ఉత్కంఠకు గురి చేస్తోందని రోహిత్ పేర్కొన్నాడు. సుశీల్ కుమార్ తమ జట్టులో ఉండడం అదనపు బలమని చెప్పిన రోహిత్, టోర్నీలో ఛాంపియన్ గా నిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News