: దేశంలో రెండు చట్టాలు ఉన్నాయి: లోక్ సభలో ఖర్గే ఫైర్


పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసుల నేపథ్యంలో, కాంగ్రెస్ నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. హర్యానాలో సీబీఐ చేత అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో రెండు చట్టాలు ఉన్నాయని... వాటిలో ఒకటి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే, మరొకటి విపక్షాలను భయపెట్టేలా ఉందని అన్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ దళితులను అవమానించేలా మాట్లాడారని... మరో కేంద్ర మంత్రి ముజఫర్ నగర్ లోని జైలుకెళ్లి నిందితులను కలిశారని... అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News