: వ్యాపార, వాణిజ్య రంగాల్లో పాక్, ఆప్ఘన్ లతో ఒప్పందాలు కుదుర్చుకుంటాం: సుష్మా
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో చేతులు కలిపి వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ సుముఖంగా ఉందని 'హార్ట్ ఆఫ్ ఆసియా' సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. పాక్ కు అనుకూలమైన రీతిలోనే ఆఫ్ఘన్ తో సంబంధాలు కొనసాగిస్తామని, ఆ దేశ భద్రతా దళాల పటిష్టతకు సహకరిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది భారత్ లో హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ క్రమంలో పాక్, ఆఫ్ఘన్ లతో పాటు ఆసియా దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు భారత పర్యటనకు రావాలని సుష్మా ఆహ్వానించారు. ఇస్లామాబాద్ లో ఇవాళ జరిగిన సదస్సులో పాక్, ఆఫ్ఘన్ ప్రధానులు నవాజ్ షరీఫ్, అష్రాఫ్ ఘని, ఆసియా విదేశీ వ్యవహారాల మంత్రులు పాల్గొన్నారు.