: ఉభయ సభలను అట్టుడికించిన నేషనల్ హెరాల్డ్ కేసు... కక్షసాధింపేనన్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు పలువురు పార్టీ నేతలకు కోర్టు నోటీసుల జారీకి కారణమైన నేషనల్ హెరాల్డ్ కేసు నేటి పార్లమెంటు ఉభయసభలను అట్టుడికించింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఎన్డీఏ సర్కారు ఈ కేసును ఎగదోసిందని సోనియా, రాహుల్ గాంధీలు నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్, చైర్మన్ పోడియాలను ముట్టడించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభను 11.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు సభాధ్యక్ష స్థానంలో ఉన్న కురియన్ ప్రకటించారు.