: కఠారి హత్య వెనుక శ్రీకాళహస్తి పాలకమండలి సభ్యుడు కాసారం... అరెస్ట్


సంచలనం సృష్టించిన చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసు వెనుక శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు కాసారం రమేష్ హస్తం ఉందని గుర్తించిన పోలీసులు ఈ ఉదయం ఆయన్ను అరెస్ట్ చేశారు. కాసారంతో పాటు న్యాయవాది యోగానంద్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పారిపోయేందుకు యోగానంద్ సహకరించినట్టు తెలుస్తోంది. వీరిద్దరి అరెస్టుతో ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 23కు పెరిగింది. మరో కీలక నిందితుడు, చింటూ అనుచరుడు మొగిలి కోసం గాలిస్తున్నామని, అతన్ని త్వరలోనే పట్టుకుంటామని చిత్తూరు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News