: ఏమైనా జరిగితే అధికారులదే పూర్తి బాధ్యత: టీఎస్ ఎక్సైజ్ మంత్రి అలర్ట్


నకిలీ మద్యం వల్ల ఏపీలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలైన నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అలర్ట్ అయ్యారు. ఎక్కడైనా కల్తీ మద్యం కేసులు వచ్చినా, ఎవరైనా చనిపోయినా, అస్వస్థతకు గురైనా అధికారులే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రత్యేకంగా అధికారుల సమావేశం నిర్వహించిన పద్మారావు... ఈ మేరకు వార్నింగ్ ఇచ్చారు. కల్తీ మద్యం ఘటనలు జరిగితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సస్పెండ్ కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని... ఎలాంటి విషాదం చోటు చేసుకోకుండా చూడాలని సూచించారు.

  • Loading...

More Telugu News