: రాహుల్ గాంధీ చెప్పులు మోసిన మాజీ కేంద్ర మంత్రి!


రాజకీయ పార్టీల నేతలు తమ అనుచరులు, సెక్యూరిటీ సిబ్బందితో చెప్పులు మోయించి, బూట్లు తొడిగించుకుని విమర్శల పాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరిపోయారు. ఆయన చెప్పులు మోసింది ఎవరో కాదు, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత పుదుచ్చేరి ఎంపీ వీ నారాయణస్వామి. నిన్న వరద ప్రాంతాల్లో రాహుల్ పర్యటించిన వేళ, ఈ ఘటన జరుగగా, మీడియాకు చిక్కి, రాజకీయ ప్రత్యర్థులు రాహుల్ పై విమర్శలు చేసేందుకు వీలు కల్పించింది. మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో, నారాయణ స్వామి చెప్పులు పట్టుకుని వాటిని రాహుల్ కాళ్ల ముందు పెట్టగా, ఆయన వాటిని వేసుకుని నడుస్తూ వెళ్లినట్టు కనిపిస్తోంది. కాగా, ఈ ఘటనను నారాయణస్వామి ఖండించారు. ఆయన బూట్లు వేసుకుని వచ్చారని, వాటిని తొలగించి నీటిలో నడవడానికి ఇబ్బంది పడుతుంటే, తన చెప్పులు ఇచ్చానని, ఆయనపై గౌరవంతోనే అలా చేశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చెప్పులు మోసే సంస్కృతి లేదని నారాయణస్వామి అన్నారు. తన షూస్ ను ఆయనే పట్టుకు నడిచారని, కనీసం సెక్యూరిటీ గార్డులకు కూడా ఇవ్వలేదని వివరించారు. ఏం జరిగినప్పటికీ, ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో రాహుల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News