: దాయాదుల పోరుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్?... ఈ నెల 24 నుంచే సిరీస్!


‘దాయాదుల పోరు’గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగనున్న సిరీస్ కు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. దీనిపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటననేది విడుదల కాకపోయినా, త్వరలో కేంద్రం నుంచి తీపి కబురు రావడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఇటీవల థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల భేటీ, తాజాగా విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ పర్యటన ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని కాస్తంత చల్లబరిచాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ముంబై దాడుల తర్వాత నిలిచిపోయిన ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కు కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇఫ్పటికే దీనిపై బీసీసీఐతో చర్చించిందని, దీనికి స్పందించిన బీసీసీఐ షెడ్యూల్ ను కూడా అందజేసిందని సమాచారం. ఈ నెల 24 నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా మొదలు కానున్న సిరీస్ వచ్చే నెల 5న ముగిసేలా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News