: మావోయిస్టులకు భారీ దెబ్బ... ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 16 మంది నక్సల్స్ హతం


నిషేధిత మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న మావోయిస్టుల వారోత్సవాలపై పోలీసులు విరుచుకుపడ్డారు. కేంద్ర బలగాల సహకారంతో చురుగ్గా ముందుకు కదిలిన ఛత్తీస్ గఢ్ పోలీసులు మావోలపై ముప్పేట దాడి చేశారు. రాష్ట్రంలోని సుక్మా జిల్లా తెట్టెమడుగు అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. అయితే పీఎల్జీఏ సమావేశాల కోసం భారీ సంఖ్యలో ఒకే చోటకు చేరిన మావోయిస్టులు తమ సహచరుల మృతదేహాలు తమ వెంటే తీసుకెళ్లారు. ఎన్ కౌంటర్ జరిగిన విషయాన్ని బస్తర్ ఐజీ ఎస్ఎస్పీ కల్లూరి ధ్రువీకరించారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల్లో ఆంధ్రా కేడర్ కు చెందిన పలువురు కీలక నేతలున్నట్లు సమాచారం. ఇక మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News