: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు... కేసీఆర్ కూడా!
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు... ఇద్దరూ దేశ రాజధాని ఢిల్లీలో నేడు బిజీబిజీగా గడపనున్నారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూతురు వివాహం, రిసెప్షన్ నిమిత్తం వెళుతున్న ఆయన ఈ రోజు మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటారు. ఆ తర్వాత 2 గంటలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ, 3.30 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తో ఆయన భేటీ కానున్నారు. ఇక నిన్న రాత్రికే ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ కూడా అరుణ్ జైట్లీ కూతురు వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కూడా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఎవరెవరితో ఆయన భేటీ కానున్నారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు.