: పార్లమెంటుకు సైకిళ్లపై వచ్చిన ఎంపీలు!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రాజ్యసభ సభ్యులు ఇద్దరు సైకిళ్లపై వెళ్లారు. ఎంపీలు మన్ సుఖ్ భాయ్, కేటీఎన్ తుల్సీలు సైకిళ్లపై పార్లమెంట్ కు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ఎంపీలు సైకిళ్లపై రావడంపై తోటి ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు.