: చెన్నై వీధుల్లో లక్ష టన్నుల చెత్త...అహర్నిశలు పనిచేస్తున్న కార్మికులు


గత వారం రోజులుగా చెన్నైని ముంచెత్తిన వర్షాలు, వరదలు అక్కడి వారికి చేదు అనుభవాలు మిగిల్చాయి. ఈ వరదల ధాటికి చెన్నై వాడలన్నీ చెత్త, మురికి, బురదతో నిండిపోయాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోయాయి. దీంతో పాడైపోయిన వాటిని వీధుల్లోకి తెచ్చిపడేస్తున్నారు చెన్నైవాసులు. ఇలా చెన్నైలో లక్ష టన్నుల చెత్త పోగైందని నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ చెత్తను తొలగించేందుకు 500 లారీలు, పది వేల మంది పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రతి కార్మికుడికి రెండు వేల రూపాయల బోనస్ ప్రకటించారు. దీంతో కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. నగరంలో పేరుకున్న చెత్తను తొలగించేందుకు నాలుగు రోజుల సమయం పడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News