: ‘వరద’ బాధితులకు ‘రాజీవ్’ హంతకుడి తల్లి సాయం!
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులలో ఒకడైన పేరరివాలన్ గుర్తుండే ఉంటాడు. అతని తల్లి పేరు అర్బుతంబాల్. గత రెండు రోజులుగా దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు ఆమె సాయమందిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెన్నై మహానగరం జలమయమైంది. చెన్నై, కడలూరు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కొంచెం కుదుటపడిన చెన్నైలో సాయమందించడానికి స్వచ్ఛందంగా పలువురు ముందుకొస్తున్న విషయం తెలిసిందే.