: ‘ఉస్మానియా’ హాస్టళ్లలో పోలీసుల తనిఖీలు
విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకునే నేపథ్యంలో ఉస్మానియా యూనివర్శిటీ వసతి గృహాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నెల 10వ తేదీన ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. కాగా, బీఫ్ ఫెస్టివల్ కు వర్శిటీ అధికారులు అనుమతించలేదు. ఈ మేరకు ఇటీవల అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.