: విమానాశ్రయ అధికారులను బయపెట్టిన బొమ్మ!


విమానంలోంచి ఓ ఇద్దర్ని అధికారులు బలవంతాన దించేసి బొమ్మల షాపుకు తీసుకెళ్లిన ఘటన ఇండోనేషియాలోని బాలిలో చోటుచేసుకుంది. బాలి నుంచి దోహా వెళ్లాల్సిన ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో ఇంగ్లండ్ కు చెందిన డేవిడ్ ఫోగ్లీ (48) అనే వ్యక్తి ఓ మహిళతో పాటు ఎక్కాడు. విమానం టేకాఫ్ కు సిద్ధంగా ఉంది. ఇంతలో భద్రతాధికారుల సమాచారంతో రన్ వే నుంచి తిరిగి టెర్మినల్ కు తీసుకువచ్చిన అధికారులు డేవిడ్ ఫోగ్లీ, అతనితో వచ్చిన మహిళను బలవంతంగా కిందికి దించేశారు. దీనికి కారణం వారి వద్దనున్న ఓ బొమ్మ! ఈ బొమ్మకు డైనమైట్ స్టిక్స్, టైమర్ లాంటివి ఉండడంతో, దానిని బాంబుగా భావించి, అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వారిని కిందికి దించేశారు. 'అది జస్ట్ బొమ్మ' అని, న్యూ ఇయర్ పార్టీకి దానిని తీసుకువెళుతున్నామని డేవిడ్ చెప్పడంతో, దానిని ఆయన ఏ షాపులో కొన్నాడో చూపించమని, ఆ షాపుకు తీసుకెళ్లారు. అక్కడ అదే తరహా బొమ్మలు చాలా ఉండడంతో చివరికి వారిద్దరినీ వదిలేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News