: కల్తీ మద్యం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేత
కల్తీ మద్యం మృతుల కుటుంబాలకు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నష్టపరిహారాన్ని అందజేశారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనపై శాఖాపరమైన చర్యలతో పాటు మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రెండు నివేదికలు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, విజయవాడ కృష్ణలంక స్వర్ణ బార్ లో కల్తీ మద్యం తాగిన సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 18 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.