: ఛత్తీస్ గఢ్ లో ‘మావో’ల మెరుపు దాడి
ఛత్తీస్ గఢ్ లో ఈరోజు కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఈ సంఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), సుక్మా రిజర్వు గ్రూప్ (డీఆర్‌జీ) దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా సాయుధులైన మావోలు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. భద్రతా దళాలు ప్రతిస్పందించే లోపే మావోలు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన జరిగిన ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించడానికి కొంత ఇబ్బంది ఎదురైంది.