: ఇక సీరియస్ గా పనిచేస్తా: దానం
కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారనే వార్తలతో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ గత కొన్ని రోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయనను లాగడానికి టీఆర్ఎస్, అట్టిపెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలే చేశాయి. ఏదైతేనేం, చివరకు కాంగ్రెస్ లోనే ఉండిపోయారు దానం. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలను తాను పట్టించుకోక పోవడం పొరపాటేనని... ఇకపై పార్టీ కోసం సీరియస్ గా పని చేస్తానని చెప్పారు. ఇకపై గట్టిగా పని చేస్తానని జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో సీనియర్ నాయకులకు దానం హామీ ఇచ్చారు. 'సేవ్ హైదరాబాద్' నినాదంతో ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్ నిర్ణయించింది.