: రోజూ 16 గంటలు కష్టపడతా: ప్రియాంకా చోప్రా
అవసరమైనంత డబ్బు, పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ రోజూ 16 గంటలు కష్టపడతానని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తెలిపింది. అమెరికన్ టీవీ సీరియల్ 'క్వాంటికో' సక్సెస్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గెలుపు అనేది గమ్యం కాదని, ప్రయాణంలో ఓ భాగమని చెప్పింది. డబ్బు, హోదా కోసం పుట్టిన రోజులు కూడా జరుపుకోలేనంత బిజీగా కష్టపడుతున్నానని ప్రియాంకా చోప్రా తెలిపింది. కాగా, ప్రియాంకా చోప్రా ప్రస్తుతం 'క్వాంటికో' సీరియల్ తో పాటు, ప్రకాశ్ ఝా దర్శకత్వంలో రూపొందుతున్న 'జై గంగాజల్'లో కూడా నటిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన 'బాజీరావ్ మస్తానీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.