: తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఖాళీ: వీహెచ్


తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు వ్యాఖ్యానించారు. మిగిలివున్న ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలు కూడా ఇతర పార్టీల్లో చేరిపోయి, తమ భవిష్యత్తు వెతుక్కునేందుకు ప్రణాళికలు వేస్తున్నారని అన్నారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, త్వరలో గ్రేటర్ హైదరాబాద్ కు జరగనున్న ఎన్నికల్లో ఎంఐఎంకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో జత కట్టే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ లో పట్టు సాధించి, కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు యత్నిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో సెటిలర్స్ కు అండగా తమ పార్టీ నిలుస్తుందని వివరించారు.

  • Loading...

More Telugu News