: ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్


ఐపీఎల్ లో పాల్గొనబోయే జట్లను ఖరారు చేసిన బీసీసీఐ పాలక మండలి, ఐపీఎల్ ఎప్పుడు నిర్వహించాలనే విషయం కూడా నిర్ణయించింది. దీంతో 2016 ఏప్రిల్ 9 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుందని తెలిపింది. రాజ్ కోట్, పూణే ఫ్రాంచైజీలలో ఆడనున్న ఆటగాళ్ల కోసం ఫిబ్రవరి 6న బెంగళూరులో వేలం పాట నిర్వహించనున్నామని బీసీసీఐ చెప్పింది. ఈ వేలంలో గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లతో పాటు మరి కొందరు కొత్త ఆటగాళ్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాగా, భారత్ లో ఐపీఎల్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన అవినీతితో ప్రతిష్ఠ కోల్పోయిన జట్లను తొలగించిన తరువాత జరుగుతున్న ఐపీఎల్ ఎంత ఆదరణకు నోచుకుంటుందనేది క్రీడావిశ్లేషకులను వేధిస్తున్న ప్రశ్న.

  • Loading...

More Telugu News