: ట్విట్టర్లో ఇక నుంచి పుల్ సైజ్ ఫోటోలు
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఓ కొత్త ఫీచర్ తో కూడిన అప్ డేట్ ను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు వరకు ట్విట్టర్ లో యూజర్ పోస్ట్ చేసే ఫోటోలు ఒక యూనీక్ సైజ్ కి క్రాప్ అయ్యేవి. ఈ విషయంలో ఇప్పుడు కొత్త వెర్షన్ ను తీసుకొచ్చింది. దాంతో యూజర్లు అప్ లోడ్ చేసే ఏ ఫోటో అయినా సైజ్ కోల్పోకుండా అలాగే ఉంటుంది. దాంతోపాటు ఒకేసారి ఎక్కువ ఫోటోలను కూడా అప్ లోడ్ చేసుకోవచ్చు. అలా చేస్తే దానికి అనుగుణంగా గ్రిడ్ లో వాటిని చూసుకునేందుకు వీలుగా కొత్త లే అవుట్ ఫీచర్ ను అందిస్తున్నారు. ఈ కొత్త ఫీచర్లతో ట్విట్టర్ యూజర్లను ఎలా ఆకర్షించనుందో చూడాలి!