: చెన్నైకి చిన్నారుల సాయం!
చెన్నై వరద బాధితుల కోసం ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, స్వచ్చంధ సంస్థలు... ఇలా ఎవరికి తోచింది వారు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని కోయంబత్తూరులో 5వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. చెన్నై, కడలూరు వరద బాధితులకు సాయం చేసే నిమిత్తం 80 టవల్స్, రూ.2,800 నగదును సంబంధిత అధికారులకు వీరు అందజేశారు.