: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదు: కేంద్ర మంత్రి హెచ్.పి. చౌదరి


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. 2026 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం కుదరదని కేంద్ర మంత్రి హెచ్ పీ చౌదరి చెప్పారు. ఆర్టికల్ 170 ప్రకారం జనాభా లెక్కల తరువాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.1,850 కోట్లు కేటాయించామన్నారు. అయితే అమరావతి నిర్మాణానికి శివరామకృష్ణన్ కమిటీ రూ.27,097 కోట్లు అంచనా వేసిందని తెలిపారు. భవన నిర్మాణాలకు రూ.10,519 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.1,536 కోట్లు, నగర మౌలిక సదుపాయాలకు రూ.5,061 కోట్లు అంచనా వేసిందని చౌదరి వివరించారు.

  • Loading...

More Telugu News