: హృతిక్ కొత్త సినిమాకు ఇక్కట్లు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమా 'మొహంజొదారో' షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూర్తి కాగానే, తన తండ్రి నిర్మాణంలో సంజయ్ గుప్తా దర్శకత్వంలో హృతిక్ కొత్త సినిమా ప్రారంభంకానుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఏకధాటిగా నాలుగు నెలల పాటు షూటింగ్ జరిపి, పూర్తిచేయాలనే భావనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. అయితే, ఈ సినిమాకు ఆదిలోనే కష్టాలు వచ్చి పడ్డాయి. తాను రూపొందించిన కథ, కథనం, మాటలను తన పర్మిషన్ లేకుండా దర్శకుడు సంజయ్ గుప్తా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ... యాక్టర్, మోడల్ అయిన సుధాన్షు పాండే కోర్టులో కేసు వేశాడు. రెండున్నర సంవత్సరాల పాటు కష్టపడి 'ఫర్మాయిష్' పేరుతో తాను కథ రాసుకున్నానని... ఆ కథతోనే తాను నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని భావించానని చెప్పాడు. ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకోనుందో వేచి చూడాలి.