: పాక్ కు యుద్ధ విమానాలు ఇస్తే... ఉగ్రవాదులపైకి కాదు, ఇండియాపైకే!: పాక్ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ


ఉగ్రవాదులను నిలువరించేందుకు పాకిస్థాన్ కు ఎటువంటి సాయం చేసినా, అది భారత్ పై పోరుకే వాడుతారని అమెరికాలో పాక్ మాజీ అంబాసిడర్ హుస్సేన్ హుక్కానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందించాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. ఆ విమానాలతో ఉగ్రవాదులతో పోరాడాల్సిన పాక్, దాన్ని పక్కనబెట్టి, వాటిని ఇండియాపై ప్రయోగిస్తుందని ఆయన అన్నారు. "ఒబామా సర్కారు పాకిస్థాన్ తో ఓ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని యోచిస్తోంది. కొద్ది నెలల క్రితం ఒక బిలియన్ డాలర్ల విలువైన యుద్ధ హెలికాప్టర్లను అందించే డీల్ కుదుర్చుకుంది. వీటితో దక్షిణాసియాలో అశాంతి పెరిగే ప్రమాదముంది" అని అన్నారు. పాకిస్థాన్ తన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వుందని, ఏ ఒక్క ఉగ్రమూలాన్నీ వదలకుండా తుదముట్టించేందుకు కట్టుబడాల్సి వుందని అన్నారు. అలా జరుగకుంటే, అమెరికన్ ఆయుధాలు భారత్ వైపు దూసుకెళతాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News