: కల్తీ మద్యం కేసులో ఏ9 నిందితుడిగా మల్లాది విష్ణు పేరు
విజయవాడలోని కృష్ణలంకలో చోటు చేసుకున్న కల్తీ మద్యం ఘటన కేసులో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 328, రెడ్ విత్ 34, 37ఎ ఎక్సైజ్ యాక్ట్ కింద 9మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏ1గా-శరత్ చంద్ర, ఏ2-పూర్ణచందర్ శర్మ, ఏ3-లక్ష్మీ, ఏ4-బాలత్రిపుర సుందరమ్మ, ఏ5-వెంకటరమణ, ఏ6-మాలకొండారెడ్డి, ఏ7-వెంకటేశ్వరరావు, ఏ8-ఎన్ వెంకటేశ్వరరావు, ఏ9- మల్లాది విష్ణులను నిందితులుగా చేర్చారు. మరోవైపు ఈ ఘటనలో ఏపీ ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది. ఈ శాఖ కమిషనర్ ఎంకే మీనా ఆదేశాల మేరకు అధికారులు రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు.