: నేను ఇందిరా గాంధీ కోడలిని... భయపడే సమస్యే లేదు: సోనియా గాంధీ


నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి నిన్నటిదాకా నోరు విప్పని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా స్పందించారు. నేటి ఉదయం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. హెరాల్డ్ కేసుపై స్పందించాలని మీడియా ప్రతినిధులు పదే పదే కోరగా ఆమె ఘాటుగా స్పందించారు. ‘‘నేను దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కోడలిని. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు’’ అని ఆమె తేల్చిచెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు నమోదయ్యాయన్న విషయం మీకు తెలియదా? అంటూ ఆమె మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News