: చండీయాగం చుట్టూ కేసీఆర్ చక్కర్లు!... పనులపై స్వయంగా పర్యవేక్షణ


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగం సమయం దగ్గరపడుతోంది. భారీ ఎత్తున చేపట్టనున్న ఈ యాగం ఈ నెల 23న ప్రారంభం కానుంది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)లో ఈ యాగం జరగనుంది. 15 రోజుల క్రితమే ప్రారంభమైన పనులు వేగంగా జరుగుతున్నాయి. యాగానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ కేసీఆర్ లో గాభరా పెరిగిపోతోంది. నిర్దేశిత సమయానికి పనులు పూర్తవుతాయా? లేదా? అన్న ఆందోళన ఆయనను పట్టి పీడిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు స్వయంగా ఫామ్ హౌస్ కు వెళ్లి పనులను పర్యవేక్షించిన కేసీఆర్, మొన్న (ఆదివారం) తన సతీమణితో కలిసి అక్కడికి వెళ్లారు. పనుల్లో వేగం పెంచాలని అక్కడి వారికి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా మళ్లీ నిన్న వరుసగా రెండో రోజు ఆయన ఫామ్ హౌస్ వద్దకు వెళ్లారు. కొనసాగుతున్న పనులను సాంతం పరిశీలించారు. కొంతమంది సన్నిహితులతో కలిసి ఆయన పనులపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశిత సమయానికంటే ముందుగానే పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అక్కడే చాలాసేపు ఉండి పనులను పర్యవేక్షించిన ఆయన అన్యమనస్కంగానే అక్కడి నుంచి తిరిగి వచ్చారట.

  • Loading...

More Telugu News