: అరుణ్ జైట్లీ ఇంట వివాహ వేడుక.. హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇంటిలో నేడు ఓ వివాహ వేడుక జరగనుంది. పరిమిత సంఖ్యలో ప్రముఖులను ఆహ్వానించిన అరుణ్ జైట్లీ కుటుంబం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు కూడా ఇన్విటేషన్ పంపింది. దీంతో నేటి సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. జైట్లీ ఇంట జరగనున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకే వెళుతున్నప్పటికీ ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News