: సత్యదేవునికి రఘువీరా బంగారు రుద్రాక్ష హారం... విలువ రూ.9 లక్షలట!
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామికి ఏపీసీసీ చీఫ్, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి నిన్న ఖరీదైన బంగారు హారాన్ని బహూకరించారు. నిన్న తన సతీమణితో కలిసి అన్నవరం క్షేత్రానికి వచ్చిన రఘువీరారెడ్డి రూ.9 లక్షల విలువైన బంగారు రుద్రాక్ష హారాన్ని సత్యదేవుడికి అందజేశారు. దాదాపు 300 గ్రాముల బంగారంతో సదరు హారాన్ని ఆయన తయారు చేయించారట. ఆలయంలో ఈవో నాగేశ్వరరావుకు ఆ హారాన్ని అందజేసిన రఘువీరా, దానిని శంకరుడికి అలంకరించాలని కోరారు. గతంలోనూ స్వామి, అమ్మవార్లకు రఘువీరా దంపతులు రూ.60 లక్షల విలువ చేసే ప్రత్యేక హారాలు అందజేశారట.