: షారూఖ్ స్పందించాడు... చెన్నై వరద బాధితులకు కోటి విరాళం
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మానవతా దృక్పధంతో స్పందించాడు. వరదల బారినపడి తీవ్రంగా నష్టపోయిన చెన్నైను ఆదుకునేందుకు తన వంతు సాయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ కూడా రాసినట్టు సమాచారం. చెన్నై కష్టాన్ని చూసి పలువురు టాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన సినీ నటులు విరాళాలు ప్రకటించారు. తాజాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ కూడా విరాళం ప్రకటించడం విశేషం. షారూఖ్ ఖాన్ గతంలో 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా 'దిల్ వాలే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.