: మద్యం మృతులకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా...మల్లాది విష్ణును విచారించనున్న పోలీసులు
విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయానికి టాస్క్ ఫోర్స్ సిబ్బంది చేరుకున్నారు. విజయవాడలోని ఎమ్.హోటల్ లోని స్వర్ణ బార్ లో మద్యం తాగి పలువురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ బార్ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు బంధువులకు చెందినదిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మల్లాది విష్ణును విచారించేందుకు ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయనను విచారించనున్నారు. కాగా, ఈ ఘటనలో మృతులకు ఐదు లక్షల రూపాయలు పరిహారం అందజేయనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.