: తమ్ముళ్లూ! పాజిటివ్ గా వార్తలు రాయండి: చంద్రబాబు
‘తమ్ముళ్లూ! ... తెలుగుదేశం ప్రభుత్వంలో మీక్కూడా ఉపకారం చేస్తున్నాము. ఇన్సూరెన్స్ పెట్టాం. ఇళ్ల జాగా కూడా ఇప్పిస్తాము. వార్తలు పాజిటివ్ గా రాయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో నిర్వహించిన జన చైతన్యయాత్ర బహిరంగసభలో బాబు మాట్లాడారు. బాబు తన ప్రసంగం చివరిలో పైవిధంగా వ్యాఖ్యానించారు.