: ఏపీ పాఠశాల విద్యలో సంస్కరణల అమలుపై కమిటీ... సభ్యులుగా చాగంటి, బీవీ పట్టాభిరామ్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించి పలు సంస్కరణలు తీసుకువచ్చేందుకు, ఇతర ప్రణాళికల అమలుకు సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నిపుణులతో ఒక సలహా సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన ఈ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సలహా సంఘానికి పాఠశాల విద్య కమిషనర్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. సలహా సంఘం సభ్యులుగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, ప్రఖ్యాత హిప్నాటిస్ట్ బీవీ పట్టాభిరామ్, ఎన్.వి.వర్లు, శాంతా బయోటెక్ ఎండీ కెఐ వరప్రసాద్ రెడ్డి ఉన్నారు.

  • Loading...

More Telugu News