: ఏబీ బర్దన్ ఆరోగ్యం నిలకడగా ఉంది: చాడ వెంకట్ రెడ్డి
సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలను ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఖండించారు. బర్దన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయసు 92 సంవత్సరాలు.